సెకండ్ వేవ్: 10 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసిన రైల్వేశాఖ

సెకండ్ వేవ్: 10 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసిన రైల్వేశాఖ

కరోనా సెకండ్‌ వేవ్‌ విస్తరిస్తోన్న సమయంలో.. రైల్వే ప్రయాణాలు తగ్గిపోయాయి. దీంతో ప్రయాణికులు లేక రైల్వే స్టేషన్లు బోసిపోవడంతో 10 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి మే 31 వరకు ఐదు రైళ్లను రద్దు చేసింది. నర్సాపూర్‌, నిడదవోలు (07241), నిడదవోలు, నర్సాపుర్‌ (07242), సికింద్రాబాద్‌, బీదర్‌ (07010), బీదర్‌, హైదరాబాద్‌ (07009), సికింద్రాబాద్‌, కర్నూలు సిటీ (07027) రైళ్లు రద్దయ్యాయి.

కర్నూలు సిటీ, సికింద్రాబాద్‌ (07028) ను ఈ నెల 29 నుంచి జూన్‌ 1 వరకు రద్దు చేశారు. మైసూర్‌, రేణిగుంట (01065) రైలును ఈ నెల 30 నుంచి వచ్చే నెల 28 వరకు రద్దు చేశారు. రేణిగుంట, మైసూర్‌ (01066) రైలును మే 1 నుంచి 29 వరకు రద్దు చేయగా, సికింద్రాబాద్‌, ముంబై ఎల్‌టిటి (02235) రైలును ఈ నెల 30 నుంచి వచ్చే నెల 28 వరకు, ముంబై ఎల్‌టిటి, సికింద్రాబాద్‌ (02236) రైలును మే 1 నుంచి మే 29 వరకు రద్దు చేశారు.